కేజీబీవీలో గ్యాస్‌ పైపు లీక్‌

కేజీబీవీలో గ్యాస్‌ పైపు లీక్‌

సీతంపేట : సీతంపేట కస్తూరిబా గాంధీ పాఠశాలలో మంగళవారం ఉదయం గ్యాస్‌పైపు లీకైంది. దీంతో మంటలు చేలరేగాయి. విద్యార్థినులు భయాందోళనతో పరుగులు తీశారు. సమాచారం అందుకున్న ఎస్‌ఐ శ్రీనివాసరావు, ఏఎస్‌ఐ జగన్నాధరావు పాఠశాలకు చేరుకుని మంటలను అదుపు చేశారు. విద్యార్థినుల కోసం ఉదయం పూట రాగిజావ వండే సమయంలో పైపు లీకైంది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో బాలికల గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల హెచ్‌ఎం కొండగొర్రె సుబ్బారావు పాలకొండ అగ్నిమాపక శకటానికి ఫోన్‌ చేశారు. శకటం వచ్చేసరికే మంటలను అదుపు చేశారు. ప్రమాదం తప్పడంతో ప్రత్యేకాధికారిణి రేవతితో పాటు సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. ఐటీడీఏ, ఆర్‌వీఎంకు సమాచారం చేరవేశారు.

Comments

Popular posts from this blog

Rain stopped the play

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ అత్యాచార కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు

Urjit Patel appointed new RBI governor, to replace Raghuram Rajan