స్పెయిన్‌పై భారత్‌ విజయం

స్పెయిన్‌పై 2-1తో భారత్‌ విజయం

 రియోడిజనీరో: ఒలింపిక్స్‌ క్రీడల ముందు స్పెయిన్‌తో జరిగిన సన్నాహక మ్యాచ్‌లో భారత హాకీ జట్టు 2-1తో విజయం సాధించింది. అక్షదీప్‌ ఫీల్డ్‌గోల్‌ చేయగా.. రూపిందర్‌సింగ్‌ పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలిచాడు. భారత్‌ శనివారం ఐర్లాండ్‌తో మరో మ్యాచ్‌ ఆడనుంది. బ్రెజిల్‌ చేరుకోక ముందు మాడ్రిడ్‌లో స్పెయిన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓడిపోయినా బ్రెజిల్‌లో గెలవడం సంతోషమని కెప్టెన్‌ శ్రీజేశ్‌ అన్నాడు. 'స్పెయిన్‌లో వాతావరణం చాలా వేడిగా ఉంది. మంచి వాతావరణం ఉన్న బెంగళూరు నుంచి ఇక్కడికొచ్చాం. మాడ్రిడ్‌ వేడి, తేమతో 40 డిగ్రీ సెంటీగ్రేడ్‌ ఉష్ణోగ్రత ఉంది. రియోలో స్పెయిన్‌పై గెలిచి మంచి ప్రదర్శన చేయడం బాగుందని' శ్రీజేశ్‌ పేర్కొన్నాడు. మరో వైపు జర్మనీని ఆస్ట్రేలియా 5-2తో ఓడించింది.

Comments

Popular posts from this blog

November Supermoon a Spectacular Sight

ప్రపంచంలో ఎన్నో చేధించలేని మిస్టరీలు ఈ మిస్టరీలకు భవిష్యత్‌లోనైనా సమాధానం చిక్కేనా...?

మహబూబ్ నగర్:-షాద్ నగర్ లో ని మిలినియమ్ కాలనీలో ఇద్దరు ఉగ్రవాదుల కాల్పుల కల కలం*