కుప్పకూలిన చార్టెడ్ విమానం..ఐదుగురు మృతి

కుప్పకూలిన చార్టెడ్ విమానం..ఐదుగురు మృతి

ముంబై: చార్టెడ్ విమానం ముంబైలోని ఘట్‌కోపర్ వద్ద కుప్పకూలింది. వీటీ-యూపీజెడ్ కింగ్ ఎయిర్ సీ 90 విమానం ఘట్‌కోపర్‌లోని సర్వోదయ నగర్‌లో నిర్మాణంలో ఉన్న భవనం సమీపంలో కూలిపోయింది. పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో పైలట్ సహా ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. విమానం బిల్డింగ్ పక్కన కూలడంతో పెను ప్రమాదం తప్పింది. చార్టెడ్ విమానం ఇంజినీరింగ్ టెస్ట్ కోసం ఉపయోగించేదని తెలుస్తోంది. సమాచారమందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. చార్టెడ్ విమానం ముంబైకు చెందిన యూవై ఏవియేషన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి చెందినది. విమానం ప్రమాదానికి గల కారణాలపై డీజీసీఏ బఋందం ముంబైకు చేరుకుని ప్రాథమిక దర్యాప్తు చేపడుతుందని సివిల్ ఏవియేషన్ డీజీ బీఎస్ భుల్లార్ తెలిపారు.

Comments

Popular posts from this blog

Rain stopped the play

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ అత్యాచార కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు

ఇంట్లో ఎవరులేని సమయంలో యువతి పై అత్యాచారం...!