అందాల కట్టడాన్ని మిస్టరీగా మారిన రహస్యాలు



ఆ అందాల కట్టడంలో ఎన్నో రహస్యాలు ఇప్పటికీ మిస్టరీగానే ఉన్నాయి. ప్రపంచపు ఏడు వింతల్లో ఒకటిగా ఖ్యాతిని సొంతం చేసుకున్న ఆ అందాల కట్టడమే తాజ్ మహల్.. అది 17వ శతాబ్దంలో తన ప్రేమకు చిహ్నంగా షాజహాన్ తన ప్రియురాలు ముంతాజ్‌కు కట్టించారని మనం పుస్తకాల్లో చదివాం. దాని గురించి అంతవరకే అందరికీ తెలుసు. అయితే ఆ అందాల కట్టడంలో అబ్బురపరిచే రహస్యాలు కొన్ని ఇప్పటికీ మిస్టరీగానే ఉన్నాయి. అవేంటో మీరే చూడండి.Source:
చేతి వ్రాత ( Calligraphy)
తాజ్ మహల్ కట్టడంలో అణువణువు చేతి వ్రాతలు కనిపిస్తాయి. దాదాపు 99 పేర్లు అల్లా గురించి ఉంటాయి. ఈ ఆర్కిటెక్చర్ ను చూసి చాలామంది ఇప్పటికీ ఆశ్చర్యం వ్యక్తం చేస్తుంటారు.

ఇంత అందంగా ఎలా అక్కడ రాసారనేది అబ్బురపరిచే రహస్యంగానే ఉంది.

 రంగుల మార్పు ( Changing colors)
తాజ్ మహల్ ఎప్పుడూ ఒకే రంగులో ఉండదు. రెండు రంగుల్లోకి మారుతూ ఉంటుంది. ఉదయాన్ని పింకి కలర్ తో అబ్బురపరిస్తే సాయంత్రం మిల్కి వైట్ తో అలరిస్తుంది. ఈ రంగులు ఈ కట్టడానికి మరింత రంగులనిస్తున్నాయి.మరి అదెలా సాధ్యమనేది తెలియని విషయమే.

 32 Million Indian Rupees 300 years Ago
ఈ కట్టడం కోసం దాదాపు 32 మిలియన్ ఇండియన్ రూపీస్ ఖర్చు పెట్టారు. 22000 మంది పనివారు 1000 ఏనుగులు ఈ కట్టడం నిర్మాణంలో పాల్గొన్నాయి. ఈ నిర్మాణం పూర్తి కావడానికి దాదాపు 21 ఏళ్లు పట్టింది.

 నాలుగు స్థంభాలు ( The Four Minarets)
తాజ్ మహల్ లో నాలుగు మినార్లు కనిపిస్తాయి. వాస్తవానికి ఇవి భూకంపాలను తట్టుకునేందుకు నిర్మించారు. అంతేతప్ప ప్రత్యేకంగా కట్టలేదు.

 సీక్రెట్ ప్లేస్ ( Secret passages)
ఈ కట్టడంలో కొన్ని రూములు ఇప్పటికీ సీక్రెట్ గానే ఉన్నాయి. వాటిని ఇంతవరకూ ఎవ్వరూ ఓపెన్ చేయలేదు. షాజహాన్ ఆ రూముల్ని అప్పుడు సీల్ చేశాడని అవి అలాగే ఉన్నాయని తెలుస్తోంది. ప్రభుత్వం కూడా వాటిని ఓపెన్ చేయడానికి సాహసించడం లేదు.

 వాటర్ ( Stream of water)
ఈ స్మారక కట్టడంలో చిన్న చిన్న నీటి ప్రవాహాలు ఉన్నాయి.అవి నమ్మశక్యం కాని విధంగా ఉన్నాయి.ఇప్పటికీ ఆ మిస్టరీని సైంటిస్టులు చేధించలేకున్నారు.

 Perfectly symmetrical
ఈ కట్టడాన్ని ఎక్కడా ఎటువంటి తేడా లేకుండా ఫర్పెక్ట్ గా నిర్మించారు. చివరకు గార్డెన్ కూడా చాలా ఫర్పెక్ట్ గా ఉంటుంది. సమాధులు కూడా చాలా కరెక్ట్ గా షాజహాన్ సమాధి ముంతాజ్ కంటే పెద్దగా కూడా ఉంటాయి.

 Religious conflicts
ఈ విషయంలో ఇప్పటికీ ఇది మిస్టరీగానే ఉంది. ఈ అపూర్వ కట్టడం గతంలో హిందూ దేవాలయం తేజోమహల్ అని కొంతమంది చరిత్రకారులు చెబుతారు. ఆధారాలతో సహా ముందుకొస్తున్నారు. కాని అది ప్రేమకు చిహ్నమని మరికొందమంది చరిత్రకారులు చెబుతారు.

 ముస్లిం పాలకులు అనేక దేవాలయాలను కూలగొట్టారని
అయితే అప్పట్లో ముస్లిం పాలకులు అనేక దేవాలయాలను కూలగొట్టారని కొన్నింటిని నామరూపాల్లేకుండా చేస్తే మరికొన్నింటిని మసీదులుగా మార్చారనే వాదనలు కూడా ఉన్నాయి. వీటికి ఉదాహరణలుగా అయోధ్యలోని రామజన్మభూమిని అలాగే మధురలోని కృష్ణాలయాన్ని చెబుతున్నారు.

 చరిత్రకారుడు పీ.ఎన్. ఓక్
దీనికి సంబంధించిన ఆధారాలను కూడా చూపిస్తున్నారు. ప్రసిద్ధ చరిత్రకారుడు పీ.ఎన్. ఓక్ ''తాజ్ మహల్'' నిజానికి హిందూ శివాలయం అని, దాని అసలు పేరు ''తేజో మహాలియా'' అని చాటుతూ అనేక ఆధారాలతో ''Taj Mahal - The True Story' పేరుతో ఎప్పుడో 1965లోనే గ్రంధం రాశారు.

 తాజ్‌మహల్ మొదట 'తేజో మహాలియా
తాజ్‌మహల్ మొదట 'తేజో మహాలియా' అని నిరూపించే స్పష్టమైన ఆధారాలు ఇచ్చారు. ఔరంగజేబు పర్షియన్ భాషలో షాజహాన్ కు రాసిన ఒక లేఖలో హిందూ ఆలయాన్ని తాజ్ మహల్ గా మార్చినట్లు రాశాడంటూ పీ. ఎన్. ఓక్ తన గ్రంధంలో తెలిపారు.

 Taj Mahal - The True Story
కానీ అప్పట్లో ప్రభుత్వం ''Taj Mahal - The True Story' పుస్తకాన్ని నిషేధించడంతో అందులో ఉన్న సమాచారం ఎవరికీ తెలీకుండా పోయింది. మత కలహాలు చెలరేగకుండా ఉండాలని దాన్ని మూసివేశారనే వాదనలు కూడా ఉన్నాయి.

 1632లో ప్రారంభించి 1653లో పూర్తి
తాజ్ మహల్ నిర్మాణాన్ని 1632లో ప్రారంభించి 1653లో పూర్తి చేశారు.అయితే దీన్ని షాజహాన్ నిర్మిచలేదని ఇది షాజహాన్ కాలానికి ముందునుంచే ఉన్నదని ఓక్ తన గ్రంధంలో రాశారు. దీని గురించి సమాచారం తెలుసుకోవాలంటే అక్కడ ఉన్న సీక్రెట్ గదులు ఓపెన్ చేస్తే తెలుస్తుందని కూడా తెలిపారు.

 ఆ సీక్రెట్ గదుల్లో ఎన్నో శిల్పాలు
ఆయన అభిప్రాయం ప్రకారం ఆ సీక్రెట్ గదుల్లో ఎన్నో శిల్పాలు దాగున్నాయని తెలుస్తోంది. అరబిందో శిష్యురాలు తాజ్‌మహల్‌ వద్ద ధ్యానంలో కూర్చుంటే ఓం నమశ్శివాయ అనే మంత్ర జపం స్పష్టంగా వినిపించినట్టు వెల్లడించారు.

 షాజహాన్‌ కాలం కంటే ముందు
బ్రూక్లిన్‌ కాలేజ్‌, న్యూయార్క్‌కు చెందిన ప్రొ. మార్విన్‌ మిల్స్‌ తాజ్‌మహల్‌ తలుపులు మీద జరిపిన రేడియో కార్బన్‌ పరీక్షలు తాజ్‌మహల్‌ నిర్మాణం షాజహాన్‌ కాలం కంటే ముందు దాదాపు 300 ఏళ్ల నాటిదని నిరూపించాడు.

 ఆధారాలతో కూడిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని
అయితే ఈ ఆధారాలతో కూడిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని ఓక్ సుప్రీంకోర్టుకు సమర్పించగా దాన్ని సుప్రీం కోర్టు తిరస్కరించింది. ఇది 2002లో జరిగింది. కొందరు చరిత్రకారులు కూడా ఓక్ వాదనను వ్యతిరేకిస్తున్నారు.

 భారతమాతకు ఇదో సుందర కళాభరణం
ఏది ఏమైనా భారతమాతకు ఇదో సుందర కళాభరణం. 1983లో యునెస్కో 'ప్రపంచ పూర్వా సంస్కృతి ప్రదేశం'గా తాజ్ మహల్ ను గుర్తించింది. మరి దీనికి సంబంధించిన నిజాలు కూడా ముందు ముందు కాలమే నిర్ణయించాలి.









Comments

Popular posts from this blog

Janatha Garage Mp3 Songs Free Download 2016 320 kbps

Pelli Choopulu (2016-Telugu) Full Movie Download Camrip

కొండగట్టు ఘాట్ రోడ్డుపై ప్రమాదం