మిస్సైల్ మ్యాన్ గురించి చాలామందికి తెలియని విషయాలు

డాక్టర్ అవుల్ పకీర్ జైనులబ్దీన్ అబ్దుల్ కలాం లోకాన్ని విడిచిపెట్టి వెళ్లి అప్పుడే సంవత్సరం అయింది. కాని ఆయన వదిలిన జ్ఙాపకాలు దేశాన్ని అనుక్షణం అభివృద్ధి పధంలో నడిపిస్తూనే ఉన్నాయి. మిస్సైల్స్ మేన్ ఆఫ్ ఇండియా గా దేశ ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న ఈ యోధుడు ఎటువంటి దుష్టత్వాన్నైనా ఎదిరించగలిగే సామర్థ్యమున్న అగ్నిని యావత్ భారతానికి కానుకగా అందించి వెళ్లాడు. అయితే ఆ యోధుడి హృదయం ఎంత సున్నితంగా ఉంటుందో మీరే చూడండి.Source:
వాటికి రక్షణ
పగిలిపోయిన అద్దాలను గోడ మీద ఉంచడానికి కలాం జీ ఎప్పుడూ ఒప్పుకోరు. ఎందుకంటే ఆ అద్దాలు ఉండటం వల్ల అక్కడ పక్షులు తమ ఆవాసాన్ని కోల్పోతాయని చెబుతారు.

వాటికి రక్షణ కావాలని చెబుతారు.

 ఐడియా
యువతరం ఎప్పుడైనా కలాంతో మీటింగ్ పెట్టినప్పుడు అక్కడ చిన్న పిల్లల ఐడియాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు. వారి ఐడియాలను శ్రధ్ధగా వినేవారు.

 స్కూల్స్ కు వెళ్లి తన ప్రసంగాలను
కలాంను రాష్ట్రపతిగా ప్రకటిస్తున్నారని తెలిసినప్పటికీ అతను ఎటువంటి సెక్యూరిటీ లేకుండా స్కూల్స్ కు వెళ్లి తన ప్రసంగాలను ఇచ్చారు. కలాంకు అధికారం ఉన్నా లేకపోయినా ఎప్పుడూ చిరునవ్వుతో ఉండేవారు.

 జీవిత కాలంలో సాధించిన జీతం మొత్తాన్ని
కలాం తన జీవిత కాలంలో సాధించిన జీతం మొత్తాన్ని అలాగే సేవింగ్స్ ను పురా అనే సంస్థకు దానం చేశారు. పురా అంటే Providing Urban Amenities to Rural Areas.

 ధన్యవాదాలు చెప్పే సమయంలో
కలాం ఎవరికైనా ధన్యవాదాలు చెప్పే సమయంలో తన సొంత కార్డ్స్ ఇచ్చేవారు. తన సంతకంతో కూడిన ఈ కార్డుల్లో తన చేతి రాతతో ధ్యాంక్స్ అని రాసి ఇచ్చేవారు.

 కాలేజి ఫంక్షన్లకు
కాలేజి ఫంక్షన్లకు కలాంజీ చీప్ గెస్ట్ గా హాజరవ్వాల్సినప్పుడు కమిటీకి అలాగే విద్యార్థులకు షాకిచ్చేవాడు. అర్థరాత్రి ఆ పంక్షన్ కు హాజరయి వారందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తేవారు.

 టైం
ఏదైనా సభలకు కాని సమావేశాలకు కాని హజరుకావాల్సి వస్తే టైంని తప్పనిసరిగా పాటించేవాడు. ఒక్క క్షణం కూడా ఆలస్యం చేసేవారు కాదు.

 కుర్చీలో కూర్చునేందుకు తిరస్కరించారంటే
కలాం ఏదైనా కుర్చీలో కూర్చునేందుకు తిరస్కరించారంటే దానికి కారణం తప్పకుండా ఉంటుంది. అది ఆ ఇతర కుర్చీలకన్నా పెద్ద కుర్చీ అయితేనే ఆయన దానిని రిజెక్ట్ చేస్తారు.

 డిస్ప్పాయింట్ కాకుండా
ఏదైనా చిన్న పిల్లల ఎగ్జిబిషన్ కు కలాం బిజీ వల్ల హాజరు కాలేనప్పుడు ఆ పిల్లలు డిస్ప్పాయింట్ కాకుండా వారివద్దకు నేరుగా వెళ్లి కలిసే దయాగుణం ఒక్క కలాంకే సొంతం.

 యాహూలో టెర్రరిజానికి సంబంధించిన కొన్ని ప్రశ్నలు
రాష్ట్రపతిగా కలాం ఉన్న సమయంలో కూడా యాహూలో టెర్రరిజానికి సంబంధించిన కొన్ని ప్రశ్నలు సంధించేవారు. దానికి ఆన్సర్ కావాలని చెప్పేవారు. యాహూ దానికి సంబంధించిన ఆన్సర్ కూడా ఇచ్చింది.

 చిన్న హోటల్
కేరళ ఫస్ట్ విజిట్ తరువాతనే కలాం దేశానికి రాష్ట్రపతి అయ్యారు. అందుకని కేరళను కలాం ఎంతో ఇష్టపడతారు. ఎవరినైనా కలవాల్సి వస్తే కేరళలోని ఓ చిన్న హోటల్ లో కలిసేవారు. ఆ హోటల్లోనే తన భోజనాన్ని కలాం ఎన్నో సార్లు తిన్నారు కూడా. అదంటే చాలా ఇష్టం.

 ఇండియాను మిస్సైల్ రంగంలో
వీటిన్నిటికంటే ముఖ్యమైనది కలాం ఇండియాను మిస్సైల్ రంగంలో అత్యున్నత స్థాయికి తీసుకెళ్లడం. అనేక రకాలైన క్షిఫణులతో భారత ఆయుధరంగాన్ని ప్రపంచ పటంలోకి తీసుకెళ్లిన ఘనత కలాంకే దక్కుతుంది.

 అగ్ని'పై అగ్రరాజ్యం కుట్ర: అగ్గిలా మారిన కలాం

Comments

Popular posts from this blog

Janatha Garage Mp3 Songs Free Download 2016 320 kbps

Pelli Choopulu (2016-Telugu) Full Movie Download Camrip

కొండగట్టు ఘాట్ రోడ్డుపై ప్రమాదం