యూజర్లకు షాకిచ్చిన జియో ఫోన్ : ఎదురుచూపులే దిక్కు !


జియో ఫీచర్ ఫోన్ కోసం ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న యూజర్లకు జియో షాకిచ్చింది. దానికోసం యూజర్లు మరి కొంత కాలం వేచి చూడక తప్పదని తెలుస్తోంది. ఆగస్టు 24 నుంచి జియో ఫ్రీ బుకింగ్స్ స్టార్టయిన సంగతి అందరికీ తెలిసిందే. సెప్టెంబర్ 21 నుంచి జియో ఫోన్ల డెలివరీ ఉంటుందని జియో వర్గాలు తెలిపాయి. అయితే ఇండియా టుడే రిపోర్ట్ ప్రకారం ఈ ఫోన్ కోసం మరికొంత కాలం వేచి చూడక తప్పదని తెలుస్తోంది.
జియో ఫీచర్ ఫోన్ స్పెషల్ రివ్యూ : ఎందుకు కొనాలి, ఎందుకు కొనకూడదు !

దాదాపు 2 లక్షల ఫోన్లను డెలివరీ చేయాల్సి రావడంతో జియో ఇప్పుడు కిందా మీదా పడుతోంది. ఈ హెవీ రష్ తోనే ఫోన్లు వాయిదా పడే అవకాశం ఉందని ఇండియా టుడే తన కథనంలో పేర్కొంది.

జియోకి సంబంధించిన రీటెయిలర్‌కు జియో నుంచి ఫోన్లు వాయిదా వేస్తున్నట్లు సమాచారం అందిందని, దాని ప్రకారం జియో ఫోన్లను అక్టోబర్ 1 నుంచి డెలివరీ చేస్తామని జియో చెప్పినట్లుగా ఇండియా టుడే రిపోర్ట్ తెలిపింది.

దీంతో జియో ఫీచర్ ఫోన్‌ను చేతికందుకోవాలని కలలు కంటున్న యూజర్లు మరికొంత కాలం వేచి చూడక తప్పని పరిస్థితులు నెలకొన్నాయి.

జియో ఫోన్లను తైవాన్ నుంచి కొంటున్నట్లు తెలుస్తోంది. అక్కడ నుంచి మొదటగా ఢిల్లీ ముంబై, కలకత్తా, హైదరాబాద్, అహమ్మదాబాద్ తదితర నగరాల్లోల్యాండ్ అవుతాయి.

అక్కడి నుంచి జియో సెంటర్లకు, రిలయన్స్ డిజిటల్ స్టోర్లకు, అలాగే డీలర్స్ కు పంపే ఏర్పాట్లు చేస్తున్నారు. వీరితో పాటు జియో అనుబంధంగా ఉన్న ఇతర కంపెనీలకు కూడా ఈ ఫోన్లను పంపే ఏర్పాట్లు చేస్తున్నారు.

జియో ఫీచర్ల విషయానికొస్తే..2.4 అంగుళాల QVGA టీఎఫ్టీ డిస్‌ప్లే, 1.2GHz సీపీయూ, 512MB ర్యామ్, 4జీబి ఇంటర్నల్ స్టోరేజ్, వీజీఏ కెమెరా, 4G VoLTE సపోర్ట్, ఇంటర్నెట్ షేరింగ్ హాట్ స్పాట్ సదుపాయం,డ్యుయల్ సిమ్ కనెక్టువిటీ (4జీ సిమ్ + 2జీ సిమ్), 2000mAh బ్యాటరీ, మ్యూజిక్/వీడియో

Comments

Popular posts from this blog

Janatha Garage Mp3 Songs Free Download 2016 320 kbps

Pelli Choopulu (2016-Telugu) Full Movie Download Camrip

కొండగట్టు ఘాట్ రోడ్డుపై ప్రమాదం