ఈ ప్రపంచాన్ని నవంబర్ 15 భయపెడుతోందా? ( బ్లాక్ అవుట్‌ )


   
  సాక్షాత్తూ ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన నాసా( అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ)పేరుతో వైరల్ అవుతున్న ఓ వార్త ఇప్పుడు భూదేవిని నమ్ముకున్న మనుషులను కలవరపాటుకు గురిచేస్తోంది. నవంబర్‌లో పక్షం పాటు భూమిని చీకట్లు కమ్మేస్తాయని పుకార్లు షికార్లు చేస్తున్నాయి.నవంబర్ 15 నుంచి29 వరకు భూమి చీకటిమయం అవుతుందని, దీనికి సంబంధించిన సమాచారంపై అమెరికా అధ్యక్షుడు ఒబామాకు నాసా చీఫ్ వెయ్యి పేజీల రిపోర్టును కూడా సమర్పించాడని ‘ది బోర్‌డ్ మైండ్’ వెబ్‌సైట్ 8 రోజుల క్రితం ఓ కథనం ప్రచురించింది.ఆ వెబ్ సైట్ కథనం ప్రకారం... ఈ ఏడాది నవంబర్ 15 నుంచి 30 వరకూ పదిహేను రోజుల పాటు భూమి చీకట్లోకి వెళుతుందట. నాసా సైంటిస్టులు ఈ విషయాన్ని చెప్పారని ఆ వెబ్‌సైట్ ప్రచురించింది. నవంబర్ ‘బ్లాక్ అవుట్‌’గా పిలిచే ఈ ఉత్పాతము నవంబర్ 15వ తేదీతెల్లవారుజామున 3 గంటల నుంచి నవంబర్ 30 సాయంత్రం 4.45 వరకూ ఉంటుందని పేర్కొంది.నవంబర్ 15న నిజంగా ఏం జరుగుతుంది?సౌర వ్యవస్థలో శుక్ర గ్రహం, గురు గ్రహాల మధ్య జరిగే ఖగోళ పరిణామాల వల్లే ఈ బ్లాకవుట్ సంభవిస్తుందని శాస్త్రవేత్తలు ఓ స్పష్టతకు వచ్చారట.
    శుక్రుడు, గురుడు పరస్పరం చాలా దగ్గరగా వస్తాయని, అప్పుడు వాటిమధ్య ధ్రుక్కోణం కేవలం ఒక డిగ్రీ మాత్రమే ఉంటుందని, ఈ సమయంలో గురుగ్రహం నైరుతి దిశగా శుక్రుడు అధిగమించి గురుడి కన్నా పది రెట్లు ఎక్కువ ప్రకాశవంతంగా మారుతాడట. ఈ చర్యవల్ల శుక్రుడిలో వేడిపెరిగి వాయువులు విడుదలవుతాయట. దీంతో సౌరవ్యవస్థలో ఇంతకు ముందెప్పుడూ లేనంతగా హైడ్రోజన్ వాయువు అలుముకుంటుందట.

    దీంతో సౌరవ్యవస్థకు లయ కారకుడైన సూర్యుడి ఉపరితలంపై ఉష్ణగ్రత ఒక్కసారిగా 9000 డిగ్రీల కెల్విన్‌కు చేరుకుంటుందట. నవంబర్ 15 తెల్లవారుజామున 2.50 గంటల సమయంలో ఈ ప్రక్రియ జరుగుతుందట. ఈ భరించలేని వేడితో ఎర్రగా ఉండే సూర్యుడు కూడా కాస్త నీలం రంగులోకి మారిపోతాడట. అనంతరం సూర్యుడు యథాస్థితికి రావాలంటే 14 రోజుల సమయం పడుతుందట.ఏం పర్లేదు!ఈ ప్రక్రియ పూర్తయిన ఎనిమిది నిమిషాల తర్వాత సాధారణ మానవులకు ఆ విషయం తెలుస్తుందట. సూర్యుడు కొంచెం కొంచెం తన ప్రకాశాన్ని కోల్పోతున్నట్లు అనిపిస్తుందట. ఈ ప్రక్రియ నిజంగానే జరిగితే

     భూమిపై 6 నుంచి 8 డిగ్రీల ఉష్ణోగ్రత పెరుగుతుందే తప్ప అంతకుమించి ఎలాంటి ప్రభావం ఉండదని కొందరు ఖగోళ శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. నవంబర్ ఎలాగో చలి కాలం కాబట్టి ఉష్ణోగ్రత పెరిగినా ఏం పర్లేదంటున్నారు. దీని గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరంలేదని మన శాస్త్రవేత్తలు ధైర్యం చెబుతున్నారు.

Comments

Popular posts from this blog

Janatha Garage Mp3 Songs Free Download 2016 320 kbps

Pelli Choopulu (2016-Telugu) Full Movie Download Camrip

కొండగట్టు ఘాట్ రోడ్డుపై ప్రమాదం